![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -39 లో..... నందుకి అమెరికా అబ్బాయి అరవింద్ ఫోన్ చేస్తాడు. దాంతో నందు బాగా ఎక్సైట్ అవుతుంది. మీరు నాకు ఫోన్ చెయ్యడం ఏంటని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తోట విషయం ఎంతవరకు వచ్చిందని అతను అడుగుతాడు. మా చెల్లి ట్రై చేస్తుందని నందు చెప్తుంది. దాంతో అతను ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు అబ్బాయి వాళ్ళ నాన్న జానూకి ఫోన్ చేసి కూడా తోట విషయం ఎక్కడ వరకు వచ్చిందని అడుగుతాడు ట్రై చేస్తున్నానని జానూ చెప్తుంది. అప్పుడే ఆ మాటలు శారద వింటుంది. వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యమన్నారు కానీ మీరు కోటి అబద్ధాలు ఆడిన అయ్యేలా లేదని శారదా అంటుంది.
దాంతో నందు శారదలకి గొడవ అవుతుంది. మీరు ఆ పెళ్లి క్యాన్సల్ అయితే టైలర్ బావని పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారు కానీ అసలు అలా జరగదని నందు చెప్తుంది. ఆ తర్వాత జానూ, సూర్య కాఫీ షాప్ కి వస్తారు. రామారావు అనే అతను హాస్పిటల్ లో లేడట అని సూర్య చెప్తాడు. మరి ఎక్కడ ఉన్నట్లు అని జానూ ఆలోచిస్తుంది. అప్పుడే రామారావు అతని కొడుకు కాఫీ షాప్ కి వస్తారు. మీరు ఇక్కడ కాఫీ తాగండి నేను వస్తానని రామారావు కొడుకు వెళ్తాడు. తుఫాన్ టీ షాప్ అతనితో గొడవ పెట్టుకుంటుంటే రామారావు సాల్వ్ చేస్తాడు. మీరు మంచి వారిలాగా ఉన్నారని రామరావుతో జానూ అంటుంది. మీ గొంతు ఎక్కడో విన్నట్ల ఉందని జానూతో రామారావు అంటాడు. మీ పేరేంటి అని జానూ అడుగుతుంది. అతను చెప్తుండగా అప్పుడే అతనికి ఫోన్ వచ్చి వెళ్తాడు . మరొకవైపు అప్పుడే భువన అటుగా వెళ్తు సూర్యని చూస్తుంది. సూర్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఆ పొగరుబోతు పక్కన ఉండి నా ఫోన్ కట్ చేస్తాడా అని భువన అనుకుంటుంది.
మరొకవైపు అమ్మ ఆకలిగా ఉందని కిన్నెరా అంటుంది. శారద వెళ్లి వదిన హెల్ప్ చెయ్యాలా అని శాంతిని అడుగుతుంది. మా ఇంట్లో తేరగా తింటున్నారని శాంతి అంటుంది. ఒకటే కూర చేసారా అని నందు అంటుంది. దాంతో శాంతి కోప్పడుతుంది. తరువాయి భాగంలో మా నాన్న డబ్బు కట్టినట్లు ప్రూఫ్ కావాలి.. మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలని సింహాద్రితో జానూ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |